30-07-2025 07:21:24 PM
కొత్తగా 44,694 మందికి లబ్ది..
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
పాపన్నపేట: నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులకు జిల్లాలో అర్హులైన 9,964 కుటుంబాలకు నూతన రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(District Collector Rahul Raj) పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని చిత్రియల్ గ్రామపంచాయతీలో నూతనంగా మంజూరైనటువంటి రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైనటువంటి కుటుంబాలకు నూతన రేషన్ కార్డుల జారీతో పాటు పాత కార్డులలో మెంబర్లను చేర్చుకోవడం కార్యక్రమాన్ని ప్రారంభించింది అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 44,694 మంది నూతనంగా లబ్ధి పొందుతున్నారని కలెక్టర్ వివరించారు. ఇందులో నూతన కార్డుల జారీతో పాటు 34,730 మంది కుటుంబ సభ్యులను పాత రేషన్ కార్డులలో చేర్చడం జరిగిందన్నారు. గ్రామాల వారీగా రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ సతీష్ కుమార్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి తో పాటు ఇతరులు పాల్గొన్నారు