calender_icon.png 22 August, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనుల జాతర కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాలి

22-08-2025 12:24:30 AM

కామారెడ్డి, ఆగస్టు 21 (విజయ క్రాంతి), జిల్లాలోనిఅన్నిగ్రామపంచాయతీలో శుక్రవారం పనుల జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్‌ఆదేశించారు.గురువారం ఐడిఓసి లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనుల జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి.

  ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను  ఆహ్వానించాలని అన్నారు, ఆయా గ్రామసభల్లో  మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపీవోలు, పిఆర్ ఇంజనీరింగ్‌అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొనేలా  చూడాలన్నారు.  గ్రామ సభలో  ఆయా గ్రామంలో చేపట్టిన గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడి భవనాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ఉద్యానవనాలు, సోక్ పిట్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, సిగ్రిగేషన్ షెడ్స్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, పశువుల కొట్టాలు, కోళ్ల షెడ్లు, 

తదితర పనుల వివరాలను ఆ పనులను చేపట్టడం వలన  గ్రామంలోని ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించాలని,  అలాగే ఉపాధి హామీ పథకంలో  అత్యధిక రోజులు పనిచేసిన ఉపాధి హామీ కూలిని, అత్యధిక పని దినాలు పనిచేసిన దివ్యాంగ కూలిని, మల్టీపర్పస్ వర్కర్స్ సన్మానించాలని డిఆర్డిఓ సురేందర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి మురళి, తదితరులు పాల్గొన్నారు.