calender_icon.png 22 August, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24న నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర

22-08-2025 12:23:54 AM

  1. పాల్గొననున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
  2. మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): ఈనెల 24న చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో గంగాధర మండలంలోని ఉప్ప రమల్యాల గ్రామం నుండి కుర్క్యాల చౌరస్తా మీదుగా గంగాధర వరకు పీసీసీ చీఫ్ మ హేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ ఇన్చార్జి మీ నాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర ఉం టుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

గురువా రం డిసిసి కార్యాలయంలో ఎమ్మెల్యేలు మే డిపల్లి సత్యం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఇతర ముఖ్య నాయకుల తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ జనిత పాదయాత్ర ప్రతి జిల్లాలో ఒక నియోజకవర్గంలో మొదట దశలో జరుగుతుందన్నారు. ఉమ్మ డి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ఈ పాదయాత్ర విజయవంతం చేయాలని, ప్రతి కాం గ్రెస్ కార్యకర్తకు,అనుబంధ సంఘాలకు, పా ర్టీ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

జనహిత పాదయాత్ర ద్వారా 19 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల తో చర్చిస్తూ వారికి అందుతున్న దానిపై ఆ రా తీస్తూ, వారి కష్టాలు తెలుసుకుంటూ రా ష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ పక్షాన వారికి అండగా ఉంటూ , ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోఆర్డినేట్ చేస్తున్నారని, మీనాక్షి నటరాజన్, పీసీ సీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యా ప్తంగా పాదయాత్ర మక్కన్ సింగ్ రాజ్ ఠా కూర్ సమన్వయం చేస్తున్నారన్నారు.

మేము ముగ్గురు మంత్రులం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థి, ని యోజకవర్గ ఇంచార్జి లు, కార్పొరేషన్ చైర్మన్ లు, ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. 24న సాయంత్రం పాదయాత్ర తరువాత గంగాధర లో బస ఉంటుందన్నారు. 25న ఉదయం ప్రభుత్వ పాఠశాలలో శ్రమ దా నం, మొక్కలు నాటే కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాల్గొంటారని తెలిపారు.

కరీంనగర్ జి ల్లా మహిళా సంఘాలకు పెట్టింది పేరు.. వ డ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సుల యజమాను లు, సోలార్ యజమానులు, ఇందిరా క్యాం టీన్ యజమానులుగా ఉన్న మహిళలతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ఇంటరాక్షన్ ఉంటుందన్నారు.

తరువాత జిల్లా ముఖ్య కార్యకర్తలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఇష్టాగోష్టి తో మా ట్లాడతారన్నారు. 24 సాయంత్రం జరిగే ఈ కార్యక్రమాన్ని రాజేందర్ రావు, పద్మాకర్ రెడ్డి, అంజన్ కుమార్ భాస్కర్ రెడ్డి, అనుబంధ సంఘాల నేతలు సమన్వయం చేస్తారని మంత్రితెలిపారు.