calender_icon.png 22 August, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన ఎస్పీ

22-08-2025 12:25:35 AM

కామారెడ్డి, ఆగస్టు 21 (విజయ క్రాంతి) : నేరానికి సంబంధించి సంఘటన స్థలంలోని సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను గుర్తించడంలో    ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం కామారెడ్డి జిల్లాకు నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర జిల్లా పోలీసు కార్యాలయంలో  పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, అత్యాధునిక పరికరాలతో రూపొందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాని కామారెడ్డి జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనున్నది. ఇకపై ఎదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది.

ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకోని సంఘటన జరిగిన స్థలం నుండి పలు రకాల సాక్ష్యాదారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన  ఆధునిక పరికరాలతో  పరీక్షలను నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్.పి తెలియజేసారు. ఈ కార్యక్రమములో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి ఐపిఎస్, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్‌ఐలు, , క్లూస్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.