calender_icon.png 10 July, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కదంతొక్కిన కార్మికవర్గం

10-07-2025 12:00:00 AM

జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు

సంగారెడ్డి, జూలై 9 (విజయక్రాంతి): దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కార్మికుల భారీ బైక్ ర్యాలీ, కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు అన్యాయం చేస్తూ లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తున్న మోడి ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు కార్మిక వర్గ పోరాటాలు ఆగవని  స్పష్టం చేశారు. లేబర్ కోడ్లు అమలైతే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం కట్టు బానిసలుగా మారాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

ఈకార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, నాయకులు బాగా రెడ్డి, యాదగిరి, ఐఎన్టీయూసీ  జిల్లా ఉపాధ్యకులు రాజేందర్ రెడ్డి, సుందరంగుడు, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి బి.ప్రసాద్,  నాయకులు నర్సింలు ,  ఎంఆర్‌ఎఫ్ కేపీఎస్ నాయకులు నారాయణ, సీఐటీయు నాయకులు నాగభూషణం, ప్రసన్న, సురేష్ రాందాస్, కొండల్ రెడ్డి, రమేష్, భీమ్ రెడ్డి, సువర్ణ, రాజు, ప్రకాష్, ప్రవీణ్, యాదయ్య, శోభ, మరియమ్మ పాల్గొన్నారు. 

జహీరాబాద్‌లో...

జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణంలో సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు మహిపాల్, మహేంద్ర అండ్ మహేంద్ర కార్మాగారం కార్మిక సంఘం నాయకులు, అంగన్వాడి కార్యకర్తలు, మున్సిపాలిటీ కార్మికులు, వివిధ కంపెనీల కార్మికులుపాల్గొన్నారు.

రామచంద్రాపురంలో...

రామచంద్రాపురం : రామచంద్రపురం లో సీఐటీయూ నాయకులు, కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతన చట్టం రూ.26 వేలు ప్రకటించాలని, ఆరోగ్య భీమా, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్ల స్థానంలో ఫర్మినెంట్ ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు.