calender_icon.png 7 February, 2026 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే మొదటి వారానికి సరస్వతి అంత్య పుష్కరాల పనులు పూర్తి చేయాలి

07-02-2026 12:00:00 AM

  1. రూ.30 కోట్లతో అభివృద్ధి-60 లక్షల మంది భక్తుల రాకకు పకడ్బందీ ఏర్పాట్లు

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

కాళేశ్వరం లో పనులు పరిశీలన అధికారులతో సమీక్షా సమావేశం

కాళేశ్వరం, ఫిబ్రవరి  6 (విజయక్రాంతి): సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనులను మే నెల మొదటి వారంలోపే పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాళేశ్వరాన్ని సందర్శించిన ఆమె ఆలయం, స రస్వతి ఘాట్, గోదావరి ఘాట్, కాళేశ్వరం వంతెన, ముక్తివనం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం దేవాలయ ఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పిఆర్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, విద్యుత్తు, దేవాదాయ శాఖల అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మిగిలిన మూడు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రాధాన్యత ఆధారంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

సరస్వతి ఆది పుష్కరాలకు సు మారు 40 లక్షల మంది భక్తులు హాజరైన విషయాన్ని గుర్తు చేసిన ఆమె, అంత్య పుష్కరాలకు దాదాపు 60 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బం దీగా చేపట్టాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి మంగళవారం వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

భక్తుల రాకపోకలకు అనుగుణంగా కుదురుపల్లి-బీరసాగర్ రహదారి నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని, సిరొంచ నుంచి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు గుర్తించాలని సూచించారు. టెంట్ సిటీ, సరస్వతి ఘాట్, గోదావరి ఘాట్ల వద్ద జన రేటర్లు ఏర్పాటు చేయాలని, మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.

దేవాలయాన్ని విద్యుత్ దీపా లతో ఆకర్షణీయంగా అలంకరించాలని, భక్తులకు రద్దీ లేకుండా స్వామి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఈఓను ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు నోడల్ అధికారుల నియామకం చేయాలని సూచించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అంచనా ప్రతిపాదనల్లో మా ర్పులు అవసరమైతే రెండు రోజుల్లో సవరించిన ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపా రు. టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపా రు.

ఈ సమావేశంలో ఎస్పీ సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరి, జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, సబ్ కలెక్టర్ మ యాంక్ సింగ్, దేవాదాయ శాఖ ఈఈ దు ర్గాప్రసాద్, పిఆర్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, విద్యుత్తు, సమాచార శాఖల అధికారులు, ఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాళేశ్వర ము క్తీశ్వర స్వామిని దర్శించుకోగా, ఆలయ అధికారులు, అర్చకులు దేవాదాయ శాఖ సం ప్రదాయం ప్రకారం పూర్ణకుంభం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచనం మండలంలో అర్చకులు ఆశీర్వాదం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు.