07-02-2026 12:00:00 AM
భీమదేవరపల్లి, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి)ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనే జ్మెంట్ (ఐసిఎం), హైదరాబాద్ ద్వారా 36 వారాల హయ్యర్ డిప్లొమా ఇన్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ శిక్షణ పొందుతున్న తె లంగాణ రాష్ట్ర సహకార శాఖకు చెందిన 52 మంది నూతనంగా నియమితులైన అసిస్టెం ట్ రిజిస్ట్రార్లు ములుకనూరు కోఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొ సైటీని సందర్శించారు.
సహకార రంగంలో ఉత్తమం గా పనిచేస్తున్న సంస్థల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే భాగంగా ఈ సందర్శన జరిగింది. ఈ సందర్భంగా సంఘం సిబ్బంది ముల్కానూరు సహకార సంఘం అందిస్తున్న వివిధ సేవలు, నిర్వహణ విధానం, రైతు సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై శిక్షణార్థులకు సమగ్రంగా వివరించారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నూతనంగా నియమి తులైన ప్రభుత్వ అధికారుల తో పరస్పర చర్చ జరిపారు. సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై వివరించారు.
అలాగే నూతన అధికారులను అభినందిస్తూ, ఈ శిక్షణ కార్యక్రమం వారి భవిష్యత్ సహకార శాఖ సేవలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.