07-02-2026 12:00:00 AM
సికింద్రాబాద్, ఫిబ్రవరి 6(విజయ క్రాంతి): గర్బిణీ స్త్రీలకు వైద్య సేవలు మరిం త చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు.ఈ మేరకు గాంధీ ఆసుపత్రి లో మల్టీ డిసిప్లినరీ కేర్ సెంటర్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ కొంత మంది స్త్రీలలో గర్బధారణ సమయంలో సాధారణంగా ప్రీఎక్లాంప్సియా అనే వ్యాధి వస్తుందన్నారు.
అయితే ప్రీఎక్లాంప్సియా అనేది గర్భధారణ సమయంలో వచ్చే తాత్కాలిక సమస్య మాత్రమే కాదు. ఇది తల్లుల్లో భవిష్య త్తులో హృదయ సంబంధిత వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తు న్నా యన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మాతృ మరణాలు తగ్గడమే కాకుండా,భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన హృదయ, కిడ్నీ వ్యా ధులను ముందుగానే గుర్తించినివారించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇది మాతృ ఆరోగ్యా న్ని దీర్ఘ కాలం కాపాడే ఒక ముఖ్యమైన ముందడుగని డాక్టర్ వాణి తెలియజేశారు.