14-05-2025 12:05:03 AM
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): అల్వాల్‌లోని గీతా హైస్కూల్ కరస్పాండెంట్ హరినాథ్‌రావు దంపతులను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో గీతా స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించన ందున వారి తల్లిదండ్రులు గీతా స్కూల్ యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించారు.
తమ పిల్లలను చిన్నప్పటి నుంచి గీతా స్కూల్‌లో చదివిస్తూ కష్టనష్టాల్ని ఓర్చుకుంటూ తమకంటే ఎక్కువ శ్రద్ధ చూపుతూ, వారి అభివృద్ధికి కారకులయ్యారని, పాదాభివందనం తెలియజేస్తూ వారిని ఘనంగా సత్కరించారు. హరినాథ్‌రావు మాట్లాడుతూ.. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ స్కూల్‌లో చదివిన విధంగానే పైచదువులు కూడా కష్టపడి చదివి అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు.