3 March, 2026 | 12:32 AM

హైదరాబాద్ లో “ది యెల్లో స్ట్రా” 4వ ఔట్ లెట్

02-03-2026 10:14 PM

ఫిబ్రవరి 28 , హైదరాబాద్ ః హైదరాబాద్‌లో ఆరోగ్యకర పానీయాలు మరియు తేలికపాటి ఆహారానికి ప్రసిద్ధిగాంచిన “ది యెల్లో స్ట్రా”  బ్రాండ్ తమ నాలుగో అవుట్‌లెట్‌ను నాలెడ్జ్ సిటీ, శిల్పగ్రామ్ క్రాఫ్ట్ విలేజ్, హైటెక్ సిటీలో ప్రారంభించింది. తాజాగా, ఆరోగ్యకరంగా, రుచికరంగా మరియు సులభంగా అందుబాటులో ఉండే ఆహారం అనే ప్రధాన సిద్ధాంతాలతో ముందుకు సాగుతున్న ఈ బ్రాండ్, తాజా జ్యూస్‌లు, స్మూతీలు, స్మూతీ బౌల్స్, సలాడ్లు, సాండ్‌విచ్‌లు మరియు తేలికపాటి ఆహారాన్ని కస్టమర్  ఆర్డర్ ఇచ్చిన తరువాతే తాజాగా తయారు చేస్తుంది.

ఈ నాలుగవ ఔట్లెట్ ప్రారంభం హైదరాబాద్‌లోని కార్పొరేట్ మరియు కమ్యూనిటీ హబ్‌లలో బ్రాండ్ స్థిరపాటును మరింత బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తులో 100 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌ల విస్తరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదం చేస్తుంది . విక్రమ్ ఖిన్‌వాసరా మరియు పియూష్ కంకారియా స్థాపించిన “ది యెల్లో స్ట్రా”, ఆర్గనైజ్డ్ జ్యూస్ మరియు ఆరోగ్యకర ఆహార రంగంలో ఉన్న విశ్వసనీయత లోటును అధిగమించాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది.

 పదార్థాల పారదర్శకత మరియు స్వచ్ఛమైన సోర్సింగ్‌పై దృష్టి సారించిన ఈ బ్రాండ్, నీరు కలపకపోవడం, ప్రిజర్వేటివ్‌లు మరియు రిఫైన్డ్ షుగర్ ఉపయోగించకపోవడం దీని ప్రత్యేకత. హైదరాబాద్‌లో అత్యంత వేగవంతమైన పని మరియు జీవనశైలి ప్రాంతాలలో ఒకటైన నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్, కార్యాలయ ఉద్యోగులు, ఫిట్‌నెస్ ఆసక్తిగల వ్యక్తులు, విద్యార్థులు మరియు సందర్శకుల కోసం ఆరోగ్యకరమైన ఆహార ఛాయస్ ను అందించే “గ్రాబ్-అండ్-గో “ వెల్‌నెస్ స్టాప్‌గా రూపుదిద్దుకుంది. 

ప్రతిరోజూ ఆరోగ్యకర ఆహారాన్ని సులభంగా మరియు ఆనందదాయకంగా అందించడం తమ లక్ష్యమని “ది యెల్లో స్ట్రా”  సహ వ్యవస్థాపకులు పియూష్ కంకారియా చెప్పుకొచ్చారు. నాలెడ్జ్ సిటీ అవుట్‌లెట్‌తో హైదరాబాద్‌లో తమ విస్తరణను మరింత బలోపేతం చేస్తూ, వేగవంతమైన జీవనశైలికి అనుగుణంగా తాజా మరియు శుభ్రమైన ఎంపికలను అందిస్తున్నామని తెలిపారు.