3 March, 2026 | 12:00 AM

ప్రైమ్‌బుక్ ఆఫ్-లైన్ రిటైల్ విస్తరణ

02-03-2026 10:12 PM

ఫిబ్రవరి 28, ముంబై: భారతీయ ఆండ్రాయిడ్ ఆధారిత ల్యాప్‌టాప్ రంగంలో అగ్రగామిగా ఉన్న 'ప్రైమ్‌బుక్' తన ఆఫ్-లైన్ రిటైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రముఖ రిటైల్ సంస్థలైన సంగీత మొబైల్స్ మరియు పై ఇంటర్నేషనల్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ విస్తరణలో భాగంగా, ప్రైమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లు ఇకపై తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని సంగీత మొబైల్స్ స్టోర్లలోనూ, అలాగే హైదరాబాద్ మరియు బెంగళూరులోని పాయ్ ఇంటర్నేషనల్ అవుట్‌లెట్లలోనూ అందుబాటులో ఉంటాయి.

ఈ నిర్ణయం ప్రైమ్‌బుక్ యొక్క ఓమ్నీ ఛానల్  వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, డిజిటల్ పునాదితో పాటు భౌతిక రిటైల్ లభ్యతను కూడా పెంచుతుంది.ప్రైమ్‌బుక్ తన రిటైల్ విస్తరణలో భాగంగా రెండు ప్రధాన మోడళ్లు ప్రైమ్‌బుక్ 2 ప్రో  రూ. 17,990 , ప్రైమ్‌బుక్ 2 మ్యాక్స్ రూ. 19,990 లను అందుబాటులోకి తెచ్చింది. సామాన్యులకు సైతం ల్యాప్‌టాప్ చేరువ చేసేందుకు ఎటువంటి ముందస్తు చెల్లింపు అవసరం లేని 'జీరో డౌన్ పేమెంట్' ఈఎంఐ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. 

ధరలోనే కాకుండా, లభ్యతలో కూడా ల్యాప్‌టాప్‌లను అందరికీ అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని ప్రైమ్ బుక్ కో ఫౌండర్,సీఈవో చిత్రాన్షు మహంత్ చెప్పారు. తక్కువ ధరలో మెరుగైన పనితీరు కనబరిచే కంప్యూటింగ్ పరికరాలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోందనీ, ప్రైమ్‌బుక్ ఆండ్రాయిడ్ ఆధారిత ల్యాప్‌టాప్‌లు వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయని సంగీత మొబైల్స్ మేనేజ్‌మెంట్ టీమ్ మెంబర్ అనిల్ ప్రభాస్ చెప్పారు. ఇదిలా ఉంటే హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లలో వినూత్నమైన ప్రైమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లు తమ కస్టమర్లను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని తాము నమ్ముతున్నట్టు పై ఇంటర్నేషనల్ ఎండి ఎస్. రాజ్‌కుమార్ పాయ్ తెలిపారు.