02-02-2026 12:48:51 AM
కోదాడ, ఫిబ్రవరి 1: పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూర్యాపేట జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి అన్నారు. ఆదివారం కోదాడ బాయ్స్ హైస్కూల్లో ఎస్సీ సంక్షేమ వసతి గృహాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించి, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
వసతి గృహాల్లో ఉంటూ చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ షేక్ సలీం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది వంటిదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మార్కండేయులు, ఉపాధ్యాయులు బడుగుల సైదులు, హెడ్మాస్టర్, వార్డెన్లు పద్మా, రుక్మిణి, వరప్రసాద్, హరికృష్ణ, బాలకృష్ణ, ప్రభాకర్, నాగరాజు, రమేష్ సైదులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.