24 August, 2026 | 2:41 AM

యువత క్రీడలపై దృష్టి సారించాలి

24-08-2026 02:05 AM

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 

భూత్పూర్, ఆగస్టు 24 : యువత క్రీడలపై దృష్టి సారించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఉడిపి కృష్ణ హోటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పాపులర్ క్రికెట్ హబ్ (బాక్స్ క్రికెట్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు ఇటువంటి క్రీడ వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.

యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాలించాలన్నారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, కౌన్సిలర్ నిమ్మల అన్నపూర్ణ, కోఆప్షన్ లు పవన్, అప్రోజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లిక్కి విజయ్ గౌడ్, నరేందర్, బోరింగ్ నర్సింలు తో పాటు తదితరులు పాల్గొన్నారు.