26 May, 2026 | 1:57 AM

యువత ఆక్రందన ‘బొద్దింకల పార్టీ’

26-05-2026 12:00 AM

తత్వవేత్తలు ప్రజాస్వామ్యంలో యువతను దేశ భవిష్యత్తు అని అభివర్ణిస్తుంటారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు యువతే సమాజంలో మార్పునకు చిహ్నమంటూ పేర్కొంటాయి. ఏది ఏమైనా, యువతలో మాత్రం నిత్య చేతనమై ఉంటుందని, సమాజంపై వారికి అవగాహన ఉంటుందనేది వాస్తవం. సరైన అవకాశాలు లేక దేశవ్యాప్తంగా నిరుద్యోగు లు ఇబ్బందిపడుతున్నారనేది నిజం. అలా చూస్తే.. చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుం టూ తల్లిదండ్రులను చూసుకుంటున్న వారు, కుటుంబాలను పోషించుకుంటున్న వారే ఎక్కువ.

ఇలాంటి సందర్భంలో వారిని టార్గెట్ చేస్తూ బ్యూరోక్రసీ లేదా జ్యుడిషియరీలో భాగమైన వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తే, సహజంగానే వారు స్పందిస్తారు. తాజాగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ‘నిరుద్యోగులు బొద్దింకలు’ అనే వ్యాఖ్యలపైనా యువత అలాగే స్పందించింది. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. సీజేఏ ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినప్పటికీ, యువత మాత్రం తమ ఆత్మగౌరవంపై  దాడిగా భావించింది. అందుకే.. సోషల్‌మీడియాలో ఉన్నట్టుండి ఒక  వ్యంగ్యపార్టీ పుట్టుకొచ్చిం ది.

దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ. పార్టీపై కొద్దిరోజుల పాటు లక్షల సంఖ్యలో మీమ్స్, పోస్టులు, వ్యంగ్య వీడియోలు, రాజకీయ సెటైర్లు వరదలా వచ్చాయి. ఇది కేవలం సర దా ట్రెండ్ కాదు.. యువతలో పేరుకుపోయి న అసంతృప్తి, నిరుద్యోగ బాధ. రాజకీయ వ్యవస్థపై విసుగుచెంది బయటపడిన రూపమని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి యువ త పరిస్థితి ఎంతో సంక్లిష్టంగా మారింది. ఉన్నత చదువులు పూర్తిచేసినా ఉద్యోగాలు రావడం లేదు. ప్రభుత్వ నియామకాలు ఆల స్యం, పరీక్షల పేపర్ లీకేజీలు, ప్రైవేట్ రంగం లో అస్థిర ఉద్యోగాలు.

పెరుగుతున్న జీవన వ్యయం యువతను తీవ్ర నిరాశలోకి నెడుతున్నాయి. ఒకవైపు స్కిల్ ఇండియా, డిజిట ల్ ఇండియా, స్టార్టప్ ఇండియా అంటూ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు గొప్పలు చెబుతుంటే, మరోవైపు లక్షలాది మంది యువకు లు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చదువుకున్న యువతలో భవిష్యత్తుపై భయం పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు యువతను చిన్నచూపు చూస్తూ మాట్లాడితే అది కేవలం ఒక వ్యాఖ్యగా మిగలదు.

అది యువత ఆత్మగౌరవాన్ని గాయప రుస్తుంది. ‘మమ్మల్ని సమస్యగా చూస్తున్నారా? లేక దేశ శక్తిగా గుర్తిస్తున్నారా?’ అన్న ప్రశ్న ఇప్పుడు యువతలో బలంగా వినిపిస్తోంది. యువశక్తి సంఘటితమై  సమా జంలోని కుళ్లును కడిగిపారేయాల్సిన సమయం ఆసన్నమైంది.

సోషల్ మీడియా వేదికగా నిరసన

ఒకప్పుడు ప్రజా వ్యతిరేకత రోడ్లపై కనిపించేది. ఇప్పుడు అదే నిరసన డిజిటల్ ప్రపంచంలో ట్రెండ్ రూపంలో బయటపడుతున్నది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటి డిజిటల్ నిరసనలలో ఒకటి. దీన్ని అభిజిత్ దీప్కే  పార్టీ వ్యవస్థాపకుడు. గతం లో ఈయన ఆప్ రాజకీయ వ్యూహకర్త పనిచేసి, ఆ తర్వాత తప్పుకొన్నారు. మొత్తంగా ఆ పార్టీ విషయం మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ ఎన్నికల సం ఘంలో రాజకీయ పార్టీగా నమోదు కాలేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా యువత చేతిలో ఇప్పుడు సామాజిక వేదిక ఆయుధమవుతున్నది. ఒక రాజకీయ వ్యాఖ్యను గంటల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చగల సామర్థ్యం ఇప్పటి యువతకు వచ్చింది.

వ్యంగ్యంగా మీమ్స్, సెటైరికల్ పోస్టులు, షార్ట్ వీడియోల ద్వారా యువత తమ కోపాన్ని, అసంతృప్తిని వ్యక్తపరుస్తోం ది. ఈ పరిణామం రాజకీయ పార్టీలకు కూడా ఒక గట్టి హెచ్చరిక. ప్రజల భావోద్వేగాలను, ముఖ్యంగా యువత మనోభావా లను తక్కువ అంచనా వేయడం ఇక ప్రమాదకరం. సోషల్ మీడియా కాలంలో ప్రతి మాటకు వెంటనే ప్రజా తీర్పు వస్తోంది. అయితే, మరోవైపు సోషల్ మీడియా వేదిక బాధ్యతా యుతంగా ఉపయోగపడాలి. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, ద్వేష ప్రచారం పెరగడం కూడా సమాజానికి మం చిది కాదు. విమర్శలు ఉండాలి.. కానీ, అవి విధాన పరమైనవిగా, విలువలతో కూడినవిగా ఉండాలి.

ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మారాల్సిన సమయం

యువతను ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూసే రాజకీయ సంస్కృతి మారాలి. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం కాకుం డా.. ఆ హామీలను అమలు చేసే బాధ్యత పాలకులపై ఉంది. ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, యువ పారిశ్రామిక వేత్తలకు మద్దతు వంటి అంశాలపై ప్రభుత్వాలు నిజాయితీగా పనిచేయాలి. రాజకీయ నాయకులు కూడా మాటల్లో సంయమనం పాటించాలి. ప్రజాజీవితంలో ఉన్నవారి ప్రతి వ్యాఖ్య సమా జంపై ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా యువతపై వ్యాఖ్యానించే సమయంలో బాధ్యత మరింత అవసరం.యువతను అవమానించడం ద్వారా తాత్కాలిక రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు. కానీ, దీర్ఘకాలంలో అది ప్రజలలో వ్యతిరేకతను పెంచుతుంది. యువత కూడా ఆవేశం కంటే అవగాహనతో ముందుకు రావాలి. సోషల్ మీడియా ట్రెండ్లు మాత్రమే కాదు.. ఓటు హక్కు, ప్రజా చర్చలు, సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య పోరాటాల ద్వారా మార్పు తీసుకు రావాలి. విమర్శించడమే మాత్రమే కాదు, మన దేశ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిన వేళ ప్రజాస్వామ్య మార్గంలో, రాజ్యాంగబద్ధంగా ఈ సామాజిక కుళ్లును కడిగేయడానికి ప్రత్యామ్నాయ వేదిక (ఆలోచనలు) కూడా సమా జానికి అందించాలి.

యువత చేతిలోనే సమాజ భవిష్యత్తు

కాక్రోచ్ జనతా పార్టీ అనే వ్యంగ్య పార్టీ ఒక పెద్ద సామాజిక హెచ్చరికగా మారింది. ఎవరైనా యువతను చిన్నచూపు చూడొచ్చు- కానీ, వారి అణచివేయలేరనడానికి కొత్త వ్యంగ్య పార్టీనే నిదర్శనం. యువత ఆవేదనను అర్థం చేసుకునే దేశమే ముందుకు సాగుతుంది. నేటి యువత కేవలం సోషల్ మీడియా ట్రెండ్ల సృష్టికర్తలు మాత్రమే కాదు..- రేపటి సమాజ నిర్మాతలు. అందుకే అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నవారు, పాలకులు యువతను విమర్శించే ముందు వారి ఆవేదనను వినాలి.

వారి గురించి మా ట్లాడే ముందు సంయమనం పాటించాలి. యువత కూడా ఆవేశం కంటే వివేకంతో, ఆలోచనతో స్పందించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో యువత గళం బలహీన స్వరం కాకూడదు. చిత్తశుద్ధితో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ఫలితమేదైనా, దిశ మార్చుకుంటూ ముందుకెళ్లాలి. యువత ఆగ్రహానికి పెద్ద పెద్ద నియంతలే నేలకూలిన గత కాల చరిత్రను గుర్తెరిగి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వ్యాఖ్యలు చేస్తే సమాజానికి మంచిది.

వ్యాసకర్త సెల్: 95736 66650యువత ఆక్రందన ‘బొద్దింకల పార్టీ’

తత్వవేత్తలు ప్రజాస్వామ్యంలో యువతను దేశ భవిష్యత్తు అని అభివర్ణిస్తుంటారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు యువతే సమాజంలో మార్పునకు చిహ్నమంటూ పేర్కొంటాయి. ఏది ఏమైనా, యువతలో మాత్రం నిత్య చేతనమై ఉంటుందని, సమాజంపై వారికి అవగాహన ఉంటుందనేది వాస్తవం. సరైన అవకాశాలు లేక దేశవ్యాప్తంగా నిరుద్యోగు లు ఇబ్బందిపడుతున్నారనేది నిజం. అలా చూస్తే.. చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుం టూ తల్లిదండ్రులను చూసుకుంటున్న వారు, కుటుంబాలను పోషించుకుంటున్న వారే ఎక్కువ. ఇలాంటి సందర్భంలో వారిని టార్గెట్ చేస్తూ బ్యూరోక్రసీ లేదా జ్యుడిషియరీలో భాగమైన వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తే, సహజంగానే వారు స్పందిస్తారు.

తాజాగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ‘నిరుద్యోగులు బొద్దింకలు’ అనే వ్యాఖ్యలపైనా యువత అలాగే స్పందించింది. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. సీజేఏ ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినప్పటికీ, యువత మాత్రం తమ ఆత్మగౌరవంపై  దాడిగా భావించింది. అందుకే.. సోషల్‌మీడియాలో ఉన్నట్టుండి ఒక  వ్యంగ్యపార్టీ పుట్టుకొచ్చిం ది. దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ. పార్టీపై కొద్దిరోజుల పాటు లక్షల సంఖ్యలో మీమ్స్, పోస్టులు, వ్యంగ్య వీడియోలు, రాజకీయ సెటైర్లు వరదలా వచ్చాయి. ఇది కేవలం సర దా ట్రెండ్ కాదు.. యువతలో పేరుకుపోయి న అసంతృప్తి, నిరుద్యోగ బాధ. రాజకీయ వ్యవస్థపై విసుగుచెంది బయటపడిన రూపమని విశ్లేషకులు భావిస్తున్నారు.

నేటి యువ త పరిస్థితి ఎంతో సంక్లిష్టంగా మారింది. ఉన్నత చదువులు పూర్తిచేసినా ఉద్యోగాలు రావడం లేదు. ప్రభుత్వ నియామకాలు ఆల స్యం, పరీక్షల పేపర్ లీకేజీలు, ప్రైవేట్ రంగం లో అస్థిర ఉద్యోగాలు. పెరుగుతున్న జీవన వ్యయం యువతను తీవ్ర నిరాశలోకి నెడుతున్నాయి. ఒకవైపు స్కిల్ ఇండియా, డిజిట ల్ ఇండియా, స్టార్టప్ ఇండియా అంటూ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు గొప్పలు చెబుతుంటే, మరోవైపు లక్షలాది మంది యువకు లు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

చదువుకున్న యువతలో భవిష్యత్తుపై భయం పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు యువతను చిన్నచూపు చూస్తూ మాట్లాడితే అది కేవలం ఒక వ్యాఖ్యగా మిగలదు. అది యువత ఆత్మగౌరవాన్ని గాయప రుస్తుంది. ‘మమ్మల్ని సమస్యగా చూస్తున్నారా? లేక దేశ శక్తిగా గుర్తిస్తున్నారా?’ అన్న ప్రశ్న ఇప్పుడు యువతలో బలంగా వినిపిస్తోంది. యువశక్తి సంఘటితమై  సమా జంలోని కుళ్లును కడిగిపారేయాల్సిన సమయం ఆసన్నమైంది.

సోషల్ మీడియా వేదికగా నిరసన

ఒకప్పుడు ప్రజా వ్యతిరేకత రోడ్లపై కనిపించేది. ఇప్పుడు అదే నిరసన డిజిటల్ ప్రపంచంలో ట్రెండ్ రూపంలో బయటపడుతున్నది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటి డిజిటల్ నిరసనలలో ఒకటి. దీన్ని అభిజిత్ దీప్కే  పార్టీ వ్యవస్థాపకుడు. గతం లో ఈయన ఆప్ రాజకీయ వ్యూహకర్త పనిచేసి, ఆ తర్వాత తప్పుకొన్నారు. మొత్తంగా ఆ పార్టీ విషయం మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ ఎన్నికల సం ఘంలో రాజకీయ పార్టీగా నమోదు కాలేదు.

కానీ, సోషల్ మీడియా ద్వారా యువత చేతిలో ఇప్పుడు సామాజిక వేదిక ఆయుధమవుతున్నది. ఒక రాజకీయ వ్యాఖ్యను గంటల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చగల సామర్థ్యం ఇప్పటి యువతకు వచ్చింది. వ్యంగ్యంగా మీమ్స్, సెటైరికల్ పోస్టులు, షార్ట్ వీడియోల ద్వారా యువత తమ కోపాన్ని, అసంతృప్తిని వ్యక్తపరుస్తోం ది. ఈ పరిణామం రాజకీయ పార్టీలకు కూడా ఒక గట్టి హెచ్చరిక. ప్రజల భావోద్వేగాలను, ముఖ్యంగా యువత మనోభావా లను తక్కువ అంచనా వేయడం ఇక ప్రమాదకరం.

సోషల్ మీడియా కాలంలో ప్రతి మాటకు వెంటనే ప్రజా తీర్పు వస్తోంది. అయితే, మరోవైపు సోషల్ మీడియా వేదిక బాధ్యతా యుతంగా ఉపయోగపడాలి. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, ద్వేష ప్రచారం పెరగడం కూడా సమాజానికి మం చిది కాదు. విమర్శలు ఉండాలి.. కానీ, అవి విధాన పరమైనవిగా, విలువలతో కూడినవిగా ఉండాలి.

ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మారాల్సిన సమయం

యువతను ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూసే రాజకీయ సంస్కృతి మారాలి. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం కాకుం డా.. ఆ హామీలను అమలు చేసే బాధ్యత పాలకులపై ఉంది. ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, యువ పారిశ్రామిక వేత్తలకు మద్దతు వంటి అంశాలపై ప్రభుత్వాలు నిజాయితీగా పనిచేయాలి. రాజకీయ నాయకులు కూడా మాటల్లో సంయమనం పాటించాలి. ప్రజాజీవితంలో ఉన్నవారి ప్రతి వ్యాఖ్య సమా జంపై ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా యువతపై వ్యాఖ్యానించే సమయంలో బాధ్యత మరింత అవసరం.యువతను అవమానించడం ద్వారా తాత్కాలిక రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు. కానీ, దీర్ఘకాలంలో అది ప్రజలలో వ్యతిరేకతను పెంచుతుంది. యువత కూడా ఆవేశం కంటే అవగాహనతో ముందుకు రావాలి. సోషల్ మీడియా ట్రెండ్లు మాత్రమే కాదు.. ఓటు హక్కు, ప్రజా చర్చలు, సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య పోరాటాల ద్వారా మార్పు తీసుకు రావాలి. విమర్శించడమే మాత్రమే కాదు, మన దేశ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిన వేళ ప్రజాస్వామ్య మార్గంలో, రాజ్యాంగబద్ధంగా ఈ సామాజిక కుళ్లును కడిగేయడానికి ప్రత్యామ్నాయ వేదిక (ఆలోచనలు) కూడా సమా జానికి అందించాలి.

యువత చేతిలోనే సమాజ భవిష్యత్తు

కాక్రోచ్ జనతా పార్టీ అనే వ్యంగ్య పార్టీ ఒక పెద్ద సామాజిక హెచ్చరికగా మారింది. ఎవరైనా యువతను చిన్నచూపు చూడొచ్చు- కానీ, వారి అణచివేయలేరనడానికి కొత్త వ్యంగ్య పార్టీనే నిదర్శనం. యువత ఆవేదనను అర్థం చేసుకునే దేశమే ముందుకు సాగుతుంది. నేటి యువత కేవలం సోషల్ మీడియా ట్రెండ్ల సృష్టికర్తలు మాత్రమే కాదు..- రేపటి సమాజ నిర్మాతలు. అందుకే అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నవారు, పాలకులు యువతను విమర్శించే ముందు వారి ఆవేదనను వినాలి. వారి గురించి మా ట్లాడే ముందు సంయమనం పాటించాలి. యువత కూడా ఆవేశం కంటే వివేకంతో, ఆలోచనతో స్పందించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో యువత గళం బలహీన స్వరం కాకూడదు. చిత్తశుద్ధితో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ఫలితమేదైనా, దిశ మార్చుకుంటూ ముందుకెళ్లాలి. యువత ఆగ్రహానికి పెద్ద పెద్ద నియంతలే నేలకూలిన గత కాల చరిత్రను గుర్తెరిగి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వ్యాఖ్యలు చేస్తే సమాజానికి మంచిది.

వ్యాసకర్త సెల్: 95736 66650