10 July, 2026 | 1:51 AM

కుటుంబమంతా చూసేలా వసుదేవసుతం

10-07-2026 12:00 AM

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన చిత్రం ‘వసుదేవసుతం’. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మిబాదర్ల నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వైకుంఠ్ బోను తెరకెక్కించారు. జూలై 10న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా విడుదల చేయించారు.

కుటుంబమంతా కలిసి చూసేలా ఉందని ఈ సందర్భంగా అజయ్ భూపతి మూవీటీమ్‌ను అభినందించారు. ఈ సినిమాలో జాన్ విజయ్, మైమ్ గోపి, సురేశ్ చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, భద్రమ్, జబర్దస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ పలు ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి జిజ్జు సన్ని కెమెరామెన్‌గా పనిచేశారు.