18 April, 2026 | 1:07 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

త్వరగా మెచ్యూర్ అవడానికి కారణాలెన్నో

01-06-2025 12:00 AM

సాధారణంగా అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే వయసు 12 సంవత్సరాలు. ఇదంతా గతం. పలు కారణాలతో ఈ వయసు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుత రోజుల్లో 8 ఏళ్లకు సైతం కొందరు చిన్నారులు మెచ్యూర్ అవుతున్నారు. మరి, ఈ పరిస్థితికి కారణాలేంటి? దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? అన్నది తెలుసుకుందాం.. 

చాలామంది అమ్మాయిలు పదేళ్లకే మెచ్యూర్ అవుతుండగా.. కొందరు ఎనిమిది ఏళ్లకే అవుతున్నారు. విదేశాల్లో అయితే ఈ వయసు ఏడు సంవత్సరాలుగా కూడా నమోదవుతున్నది. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. భారత్‌లో దాదాపు 15 శాతం మంది బాలికలు ఎనిమిదేళ్లకే మెచ్యూర్ అవుతున్నారు. 

చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి ప్రధాన కారణం హార్మోన్లలో మార్పులు అని నిపుణులు చెబుతున్నారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు పునరుత్పత్తి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, నియంత్రించడానికి కారణమవుతాయి.

ఈ హార్మోన్లు సాధారణంగా 8 సంవత్సరాల మధ్య పెరిగి, పీరియడ్స్ స్టార్ట్ కావడానికి కారణమవుతాయి. కానీ.. కొద్దిమంది బాలికల్లో ఈ హార్మోన్లు చిన్న వయస్సులోనే పెరగడం ప్రారంభవుతున్నాయి. ఈ కారణంగానే ఎనిమిదేళ్ల కంటే ముందు కూడా పీరియడ్స్ వస్తున్నాయని చెబుతున్నారు. 

చిన్నవయసులోనే అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా కూడా పీరియడ్స్ త్వరగా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు కణజాలం ఉండటం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని, ఇవి చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి కారణమవుతాయని చెబుతున్నారు. 

శారీరక శ్రమ తగ్గడం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం కూడా ఈ సమస్యకు కారణం అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జంక్ ఫుడ్స్‌లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే అనారోగ్యకరమైన కొవ్వులు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తాయని, ఇవి రుతుక్రమాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు.