calender_icon.png 7 June, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైగ్రేన్ నొప్పి తగ్గాలంటే!

01-06-2025 12:00:00 AM

మైగ్రేన్ అనేది ఒక రకమైన తీవ్రమైన తలనొప్పి. ఇది సాధారణ తలనొప్పికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఒక నాడీ సంబంధిత సమస్య. తలలో ఒకవైపున బాగా నొప్పి ఉంటుంది. ఈ నొప్పి కొన్ని గంటల నుంచి చాలా రోజుల వరకు ఉంటుంది. అంతేకాకుండా, తరచుగా వికారం, వాంతులు వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. మీరు కూడా మైగ్రేన్ వల్ల బాధపడుతుంటే కింది చిట్కాను పాటించండం ద్వారా ఉపశమనం పొందుతారు. 

మైగ్రేన్ కారణంగా తలనొప్పి ఉంటే మొదట సగం బకెట్‌లో గోరువెచ్చని నీరు తీసుకుని ఆపై మీ పాదాలను అందులో ముంచి 15 నిమిషాలు అలాగే ఉండండి. తలలో నొప్పి క్రమంగా తగ్గుతుంది. ఈ ప్రక్రియలో ఉపశమనం పొందడానికి తలపై కోల్డ్ జెల్ ప్యాక్ కూడా ఉంచండి.

మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. మైగ్రేన్లను ప్రేరేపించే సాధారణ కారణాలు ఒత్తిడి, నిద్ర లేకపోవడం లేదా హార్మోన్ల మార్పులు, కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు (చాక్లెట్, చీజ్, రెడ్ వైన్, కెఫిన్ వంటివి). వాతావరణ మార్పులు, ధూమపానం. కొన్నిసార్లు ఈ అలవాట్లు మైగ్రేన్ వచ్చేలా చేస్తాయి.