calender_icon.png 9 July, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలోనే లేరు

19-03-2025 04:41:36 PM

మాజీమంత్రి మల్లారెడ్డి...

మేడ్చల్ (విజయక్రాంతి): తనంత అదృష్టవంతులు ప్రపంచంలోనే లేరని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య 49వ వివాహ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భార్య కల్పనా రెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. కార్యకర్తలతో కలిసి ఆనందంగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భగవంతుడు తనకు అన్నీ ఇచ్చాడని, మంచి పిల్లలను, డబ్బును ఇచ్చాడన్నారు.

ఒకపక్క ప్రజాసేవ చేస్తూనే, మరోపక్క మంచి డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేస్తున్నానని, జీవితం ధన్యమైందన్నారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరై మల్లారెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ఆకిటి నవీన్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.