19-01-2026 12:26:24 AM
మాజీ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్
కొత్తపల్లి, జనవరి 18 (విజయ క్రాంతి): పార్టీ మారినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు రోజుల క్రితం డివిజన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వెలిచాల రాజేందర్ రావు తమ ఇంటికి వచ్చారని ఇంటికి వచ్చిన అతిధిని సాధారంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించామని.
అయితే వెంటనే వారు వారి దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కండువాలను మాకు కప్పడం జరిగిందని.. వెంటనే ఆ కండువాలను తీసేశామని, ఆ సమయంలోనే కొంతమంది గిట్టని వాళ్లు ఫోటోలు తీసి మీడియాకు అందించారని పేర్కొన్నారు. గతంలో రేకుర్తి డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీ లో చేరిన విషయాన్ని గుర్తు చేశారు.
టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాయకత్వంలో డివిజన్లో అనేక విధాలుగా కరీంనగర్ కు దీటుగా అభివృద్ధి చేశామని .. అట్లాంటిది పార్టీని విడిచిపోవడం అనేది కేవలం కొంతమంది దురుద్దేశంతో చేసిన కుట్రనే అని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 19వ డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళుతున్నానని.. ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఎప్ప టికైనా ఎమ్మెల్యే గంగుల వెంటే ఉంటామని.. బిఆర్‌ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.