calender_icon.png 6 May, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యవ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి..

24-01-2025 04:29:40 PM

ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదవాలి..

గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసింది.. 

మునుగోడు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం మండలంలోని కొంపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన మూడు అదనపు తరగతి గదులు, వెదిరే పూలమ్మ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన కళావేదికను ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గాన్ని ఆదర్శం నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో భాగంగా మా మొదటి ప్రాధాన్యత  విద్యకే ఇస్తున్నాం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పరిమితిని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఒక ప్రాంతం బాగుపడాలన్న రాష్ట్రం బాగుపడాలన్న దేశం బాగుపడాలన్న విద్యపైన అత్యధికంగా ఖర్చు చేయాలి, ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదివేల మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని అన్నారు.

ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఉండేలా మౌలిక సదుపాయాల కల్పన చేసి ప్రతి పాఠశాలకు 5 నుండి 6 ఎకరాల భూమిని కేటాయించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెదురే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ మెగా రెడ్డి విజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, గ్రామ మాజీ సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు, తాటికొండ సైదులు, అనంత లింగస్వామి, మాదరగొని యాదయ్య, నామోజు రత్నాచారి, మక్కెన అప్పారావు, దాము యాదయ్య, జీడిమడ్ల యాదయ్య, బోయపర్తి ప్రసాద్, దాము నరసింహ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.