06-05-2025 10:11:47 AM
కాశ్మీర్ అంశపై ఐరాస భద్రతామండలిలో పాకిస్థాన్ ప్రయత్నం విఫలం
పహల్గాం ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన ఐరాస
న్యూఢిల్లీ: కాశ్మీర్ అంశంపై ఐరాస భద్రతామండలి(United Nations Security Council)లో పాకిస్థాన్ ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుత పరిస్థితిని అంతర్జాతీయ సమస్యగా చేయాలనుకున్న ప్రయత్నంలో పాక్ కు చుక్కెదురైంది. ఐరాస భద్రతామండలి అంతరంగిక సమావేశంలో పాకిస్థాన్ చర్చను కోరింది. సమస్యను భారత్ తో ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని భద్రతా మండలి సూచించింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఐరాస భద్రతామండలి తీవ్రంగా ఖండించింది. సభ్య దేశాలు పాకిస్థాన్ కు కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించాయి. పాకిస్థాన్ చెప్పిన పలు అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి. ఐరాస లష్కర్ ఎ తొయిబా ప్రమేయంపై పాకిస్థాన్ ను ఆరా తీసింది. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చిచంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ జరుపుతున్న క్షిపణి పరీక్షలపై ఐరాస భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ భద్రతామండలిలో ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న విషయం తెలిసిందే.