06-05-2025 09:38:26 AM
ఓఎంసీ మైనింగ్ కేసులో నేడు తుది తీర్పు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓబులాపురం గనుల కేసులో(Obulapuram Mining Case) నేడు తీర్పు వెలువడనుంది. ఈ కేసులో సుమారు పదమూడేళ్ల పాటు విచారణ ప్రక్రియ కొనసాగింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు తుది తీర్పు ఇవ్వనున్నట్లు మార్చి 28న ప్రకటించింది. దీంతో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Former Minister Sabitha Indra Reddy) సహా నిందితుల భవితవ్యం తెలనుంది. ఓబులాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు(Hyderabad CBI Court) కాసేపట్లో తీర్పు రానుంది. కోర్టు తీర్పుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై 2009లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఓఎంసీ కేసులో సీబీఐ 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీట్ లో గాలి జనార్దన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్, కృపానందం, బీవీ శ్రీనివాస రెడ్డి పేర్లు ఉన్నాయి. మొత్తం అభియోగపత్రాల్లో 9 మందిని సీబీఐ నిందితులుగా చేర్చింది. 2022 లో కోర్టు ఐఏఎస్ శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జి చేసింది.