వీళ్లే పుతిన్ కూతుళ్లు
ఎట్టకేలకు బయట కొచ్చిన రష్యా అధ్యక్షుడి సంతానం
మాస్కో, జూన్ 9: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబ ంధించిన ప్రతి వ్యక్తిగత విషయం అత్యంత రహస్యంగానే ఉంటుంది. ఆయన భార్యాబిడ్డలు, అలవాట్లు, బంధువర్గం తదితర విషయాలేవీ అంత తేలిగ్గా బయటిప్రపంచానికి తెలియవు. అయితే ఆయన ఇటీవల మరోసారి రష్యా అధ్యక్షుడిగా ఏకపక్షంగా ఎన్నికైన తర్వాత ఈ విషయంలో కొంత మార్పు వచ్చినట్టే ఉన్నది. తాజాగా పుతిన్ కూతుళ్లు అజ్ఞాతం నుంచి జనజీవన శ్రవంతిలోకి వచ్చారు.
గత వారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పుతిన్ కూతుళ్లు కెతరీనా టిఖనోవా, మరియా వొరొం ట్సోవా తలుక్కున మెరిశారు. రష్యాలో పుతిన్ తన పరపతిని మరింత పెంచుకొనే ఎత్తుగడల్లో భాగంగానే కూతుళ్లను బయటి ప్రపంచానికి పరిచయం చేశారని అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ మాజీ అధికారి రొనాల్డ్ మార్క్స్ తెలిపారు. 39 ఏండ్ల వొరొంట్సోవా జెనటికల్ పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. 37 ఏండ్ల టిఖొనోవా అక్రొబాటిక్ డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు.






