18 July, 2026 | 7:33 PM

అశోక్ లేకుంటే టెస్లా ఉండేది కాదేమో!

10-06-2024 02:02 AM

ఆయన కృషితోనే ఆటో పైలట్, ఏఐ సాధ్యమైంది

భారత సంతతి వ్యక్తిపై ఎలాన్ మస్క్ ప్రశంసలు

టెక్సాస్ (అమెరికా), జూన్ 9: భారత్ సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కృతజ్ఞతలు తెలిపారు. టెస్లా ఆటోపైలట్ బృందంలో అశోక్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ బృందంలో మొదట చేరిన వ్యక్తి అశోక్ కావడం విశేషం. అంతకుముందు టెస్లా సం స్థ విజయంలో ఎలాన్ మస్క్ పాత్రను కొనియాడుతూ అశోక్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. టెస్లా ఏఐ, ఆటోపైలట్ అంశాల్లో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ప్రయోగాన్ని మొదలుపెట్టే సమయంలో మస్క్ కోరుకున్న విషయాలు అసాధ్యమని చాలా మంది భావించారు.

అయి నా బృందంపై నమ్మకం ఉంచి మ మల్ని ముందుకు నడిపించారు. 2014లో ఆటోపైలట్‌ను చిన్న స్థాయి కంప్యూటర్‌తో ప్రారం భిం చాం. దాని మెమొరీ 384కేబీ మా త్రమే. లేన్ కీపింగ్, లేన్ చార్జింగ్ వం టి ఫీచర్లు అమలు చేయాలని ఇంజినీరింగ్ బృందానికి మస్క్ సూచిం చారు. అయితే ఆయన మాటలను ఎవరూ నమ్మలేదు. అయినా ఏమా త్రం వెనక్కి తగ్గకుండా తన లక్ష్యం వైపు మా బృందాన్ని నడిపించారు. ఆ ప్రోత్సాహంతోనే 2015లో మొ దటి ఆటోపైలట్ వ్యవ స్థను తీసుకొచ్చాం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని టెస్లాను ఈ స్థాయిలో నిలిపారు. ఆయన ముందుచూపు అద్భుతం.

భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఆటోమేటెడ్ కార్లు, ఇంట్లో పని చేసే హో మ్ రోబోట్స్ రాబోతున్నాయి అని అశోక్ వెల్లడించారు. అశోక్ ట్వీట్‌పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ ఆయనతో పాటు ఆటోపైలట్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్స్ అశోక్! టెస్లా ఏఐ, ఆటోపైలట్ టీంలో మొ దట చేరిన వ్యక్తి అశోక్. ప్రస్తుతం ఆ విభాగానికి ఆయనే నేతృత్వం వహిం చే స్థాయికి ఎదిగారు. అశోక్, అతని బృందం లేకుంటే టెస్లా కేవలం ఓ సాధారణ కార్ల కంపెనీలాగే ఉండేది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ స్థాయి కి ఎదిగేది కాదు. ఇదంతా చెప్పమని నేను ఎప్పుడూ అశోక్‌కు చెప్పలేదు. 10 నిమిషాల ముందు ఆయన ట్వీ ట్ చూసి ఆశ్చర్యమేసింది అని మ స్క్ ట్వీట్ చేశారు.