calender_icon.png 24 June, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటీసులతోనే సరిపెడుతున్నారు!

24-06-2025 12:21:34 AM

- పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ అధికారులు తీరుపై పలు విమర్శలు 

- అక్రమ నిర్మాణాల పై కన్నెత్తి చూడని అధికారులు

- పెద్దలకు ఒక న్యాయం..పేదలకు మరో న్యాయమంటూ స్థానికుల నిట్టూర్పు 

- ప్రత్యేక అధికారి పత్తా లేరు 

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 23: పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో భారీగా అక్రమ షెడ్లు, కమర్షియల్ షెటర్లు జోరుగా వెలుస్తున్నా.. ఆ అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కేవలం నోటీసులతో సరి పెడుతున్నారు కానీ... వాటిపై చర్యలకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్‌టీఎల్‌లను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు వంత పాడుతున్నారు. పన్నుల రూపంగా ప్రభుత్వాన్ని రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతున్న సం బంధిత అధికారులు చలనం రావడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో చిరు వ్యాపారులు చేసుకుని జీవనం సాగించే గూడారాలను, చిన్న దుకాణాల ను కూల్చివేతకు పాల్పడే అధికారులు కొంచెం రాజకీయ పలుకుబడి కలిగిన బడాబాబులు ప్రభుత్వ స్థలాలు, చెరువు ఎఫ్‌టీఎల్‌లను అక్రమించి నిర్మాణాలు చేపడితే అటువైపు కన్నెతి చూడ దానికి జంకుతున్నారు.

చర్యలకు కాలయాపన

 అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ జాతీయ రహదారికి అనుకుని ఉండడంతో పలు కాలనీలు కొత్తగా వెలసి శరవేగంగా అభివృద్ది చెందుతుంది. ఇదే అదునుగా భావించి.. అక్రమా ర్కులు చెరువు ఎఫ్‌టీఎల్, రోడ్లను ఆక్రమించి ఎలాంటి అనుమతులు తీసుకుం డానే కమర్షియల్ షెటర్లు, భారీ షెడ్ల నిర్మాణాలు చేపడుతు తమ జేబులు నింపుకుం టున్నారు. మున్సిపాలిటీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకుండానే షెటర్లు నిర్మాణ పనులు చక చకా సాగిస్తున్నారు.

బలిజగూడ వెళ్లే రహదారికి అనుకుని షెటర్లు, అలాగే పె ద్ద అంబర్‌పేట్ నుంచి మునుగనూరు వెళ్లే దారిలో .. 12వ వార్డు అంజనాద్రి నగర్ వెళ్లే దారిలో జోరుగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఆమ్యామ్యాలకు అలవాటు పడి నోరు మెదపడం లేదని పలు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే తప్పదన్నట్టు మొక్కుబడిగా కేవలం నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ అట్టి నిర్మాణాలు పూర్తి అయ్యే వరకు మాత్రం 

జాడలేని ‘స్పెషల్’ ఆఫీసర్

పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై స్థానికులు కలెక్టరేట్ ప్రజావాణిలో కూడా ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్న ఇప్పటివరకు చర్యలు శూన్యం. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా కొనసాగుతున్న అధికారి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీమాసింగ్ సైతం మున్సిపల్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఎవరికి అంతుచికడం లేదు.

ఉన్నతాధికారు లు సైతం అక్రమ నిర్మాణాలపై కొరడా జూలిపించకపోవడం ఏమైటని స్థానిక ప్రజ లు నోరెళ్ళ బె డుతున్నారు. ప్రత్యేక అధికారిగా ప్రతిమాసింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మున్సిపాలిటీ ని సందర్శించిన దాఖలాలు లేవు. మున్సిపాలిటీలో పాలకవర్గం గడువు ముగిసిన అనంతరం అధికారుల ఆడిందే ఆట పాడింది పాటగా సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన ప్రత్యేక అధికారి ప్రతీమాసింగ్ పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకమైన ఫో కస్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారులకు చలనం లేదు

పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో జరిగే అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఎ న్ని సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. నోటీసుల ఇచ్చాం... ఇవాళా, రేపు అంటూ చర్యలు తీసుకుంటామంటు దాట వేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలి.

 యంజాల్ ప్రహ్లాద్, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ