6 April, 2026 | 5:43 PM

అవి రజాకార్ పార్టీలే

07-05-2024 12:47 AM

ఎంఐఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలది ముస్లింలీగ్ ఎజెండా

అవన్నీ తబ్లిగీ జమాత్ సమర్థకులే

హిందువుల రిజర్వేషన్లు కోసి.. ముస్లింలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ

కోర్టు అక్షేపించినా చట్టం చేసింది

పెద్దపల్లి, నల్లగొండ, చౌటుప్పల్ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

మంథని/యాదాద్రి భువనగిరి/ నల్లగొండ, మే 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎంఐఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు తబ్లిగీ జమాత్, రజాకార్ విధానాలను అనుసరిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఆ మూడు పార్టీల ఎజెండా ఒక్కటేనని, అది ముస్లింలీగ్ ఎజెండా అని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నడ్డా సోమవారం మంథని, చౌటుప్పల్, నల్లగొండ సభల్లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ దళితులు, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లకు కోత పెట్టి ముస్లింలకు చట్ట వ్యతిరేకంగా రిజర్వేషన్లు కల్పించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఆక్షేపించినా కాంగ్రెస్ ఊరుకోలేదని  మండిపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రాజ్యాంగ వ్యతిరేకంగా రిజర్వేషన్లు కల్పించిందని ఆరోపించారు. తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మతపరమైన రిజర్వేషన్లు ఎత్తేస్తామని నడ్డా స్పష్టం చేశారు. 

రాజనీతికి నిర్వచనం మోదీ

దేశ రాజకీయ చరిత్రలో ఆదర్శవంతమైన రాజనీతికి నిర్వచనం ప్రధాని నరేంద్రమోదీ అని నడ్డా కొనియాడారు. దశాబ్ద కాలంలో దేశంలో సమూల మార్పు లు తీసుకొచ్చి ధర్మాన్ని కాపాడుతూ.. రాజకీయం అంటే అభివృద్ధి, జవాబుదారీ పాల న అని నిరూపించారని తెలిపారు. చౌటుప్పల్ సభలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, సంస్కృతికి కాంగ్రెస్ విరోధిగా తయారైందని ఆరోపించారు. మోదీ పాలనలో దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతమైందని.. పారిశ్రామిక,సేవా రంగాల్లో దేశం దూసుకుపోతున్నదని తెలిపారు. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లు ఒకప్పుడు మేడిన్ చైనా, తైవాన్, జపాన్ అని ఉంటే.. ఇప్పుడు మేడిన్ ఇండియా అని ఉండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పేదలకు ఇప్పటికే 4 కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చామని.. రాబోయే రోజుల్లో మరో 3 కోట్లు నిర్మిస్తామని ప్రకటించారు. 80 కోట్ల మందికి బియ్యం ఉచితంగా అందిస్తున్నామని, వంట గ్యాస్‌ను చౌక ధరలకు పైప్‌లైన్ల్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 

అధికారికంగా విమోచన దినోత్సవం

బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ ౧౭న అధి కారికంగా నిర్వహిస్తామని జేపీ నడ్డా తెలిపా రు. నల్లగొండలో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా నిర్వహిం చిన సభలో ఆయన మాట్లాడుతూ.. తబ్లిగీ జమాత్‌కు మద్దతుదారులైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐ ఎం పార్టీల వల్ల జనజీవన స్రవంతికి విఘా తం కలుగుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిం దని విమర్శించారు. అయోధ్యలో రామమం దిర నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిం చిందని ఆరోపించారు.  జేఎన్‌యూలో దేశ వ్యతిరేక నినాదాలు చేసేవారికి రాహుల్ గాంధీ అండ గా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌కు దేశం గురించి ఎలాంటి ఆందోళన లేదని, ఓట్లకోసం ముస్లింలను మభ్య పెట్టే విధానాన్ని అనుస రిస్తున్నదని ఆరోపిం చారు. ప్రధాని మోదీకి బలం చేకూర్చేం దుకు నల్లగొండ నుంచి శానంపూడి సైదిరెడ్డిని, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. 

బీఆర్‌ఎస్ కాంగ్రెస్ అవినీతి పార్టీలు

రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలన రెండూ అవినీతిమయమేనని నడ్డా విమర్శించారు. ౨జీ, కామన్‌వెల్త్ వంటి కుంభకోణాలకు కాంగ్రెస్ పాల్పడగా, మద్యం కుంభకోణం, కాళేశ్వరాన్ని ఏటీఎంగా బీఆర్‌ఎస్ మార్చుకుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ పలు అవినీతి కేసుల్లో బెయిల్‌పై తిరుగుతుండగా, బీఆర్‌ఎస్ నాయకురాలు జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశ భద్రతకు ముప్పుగా మారిన తీవ్రవాదులు మరణిస్తే ప్రతిపక్షాలకు దుఃఖం ఎందుకని ప్రశ్నించారు.