6 April, 2026 | 3:46 PM

ప్రయాణికులకు తాత్కాలిక షెడ్స్

07-05-2024 12:40 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (విజయక్రాంతి) : వేసవి తీవ్రత రోజురోజుకు పెరు గుతోంది. ఉదయం 10 గంటలకే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే బయపడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలకు బస్‌స్టాపుల్లో షెల్టర్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల అవస్థలను గమనించిన ఆర్టీసీ గ్రేటర్ వ్యాప్తంగా తాత్కాలిక షెడ్స్‌కు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ వ్యా ప్తంగా 24డిపోల పరిధిలో సుమారు 2800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. గ్రేటర్ వ్యా ప్తంగా 1765 బస్ షెల్టర్లు ఉన్నాయి. ఈ షెల్ట ర్ల ద్వారా ప్రయాణికులు సగం నీడను కూడా పొందలేకపోతున్నారు.  

ఉపశమనం కోసం చలువ పందిళ్లు

ప్రయాణికులు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఆర్టీసీ తాత్కాలికంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ జోనల్ అధికారులు ఆయా డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు మేడ్చల్, కొంపల్లి ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు 11 చలువ పందిళ్లను ఏర్పాటు చేశా రు. కానీ కొంతమంది డిపో మేనేజర్లు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లును వివరణ కోరగా, ఇప్పటికే అన్ని డిపోల మేనేజర్లకు ప్రయాణికుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించిమని చెప్పారు.