calender_icon.png 18 February, 2026 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారమిచ్చారు.. హామీలు మరిచేరు..?

18-02-2026 01:10:16 AM

  1. ఎన్నికలు ముగిశాయి.. హామీలే మిగిలాయి
  2. గెలిచిన లీడర్ల నెత్తిన బాధ్యత 
  3. ఇక పరిపాలనపై ఓటర్లు నజర్
  4. ఐదేళ్లు లీడర్లు ప్రజాసేవకులు 

బెల్లంపల్లి, ఫిబ్రవరి 17: ఈ నెల 11న పోలింగ్‌లో మున్సిపల్ పగ్గాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ హోరా హోరీగా తలపడ్డాయి. 13న కౌంటింగ్ జరిగిం ది. మున్సిపల్ ఎన్నికల్లో 14 స్థానాలు కాంగ్రెస్ కు, బీఆర్‌ఎస్ 14, స్వతంత్రులకు ఐదు, బీజేపీకి ఒక స్థానం ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు సమ స్థానాలను అప్పగించి ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు.

ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీలకు పూర్తిస్థాయిలో ఎవరికీ పూర్తి మెజార్టీని ఇవ్వలేదు. ఇతరుల మద్దతు తీసుకొని మాత్రమే పుర పగ్గాలను చేపట్టాలి. ఇలా ఐదుగురు స్వతంత్ర సభ్యులు, బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి బల్దియా అధికార పీఠం ఎక్కింది. సమీకరణ చేసి చివరి సమయంలో శక్తిసామర్థ్యాలు సరిపోక చేతులెత్తింది. మునిసిపల్  చైర్పర్సన్ గా దావా స్వాతి, వైస్ చైర్మన్ గా రాగం శెట్టి సతీష్ ఎన్నికయ్యారు. ఇప్పటితో ఎన్నికల ప్రక్రియ ముగిసింది..

హామీలపైనే నజర్..

పుర ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. పరిపాలన పగ్గాలు కాంగ్రెస్ పార్టీ కి దక్కాయి. ఇక మిగిలింది ప్రజలకిచ్చిన హామీలే వారి ముందున్నాయి. ఎన్నికలలో  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ లే ప్రజల ముందు ప్రతిరూపంగా ఎదురు బడి ఉన్నాయి. ఎన్నికల్లో గెలిపిస్తే పట్టణాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చారు. ప్రజలకు సౌకర్యమైన జీవితానికి అభివృద్ధి ప్రధాన ఏజండగా పనిచేస్తామని హామీలు గుప్పించారు.

రోడ్లు, మురికి కాలువలు, తాగునీటి సౌకర్యం, ఇతర ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం పనిచేస్తామని గెలిచిన పార్టీలు అధికార పగ్గాలు చేపట్టి ప్రమాణాలు చేశాయి. పట్టణ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టిన రోజు ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చిన హామీల్లో తమ ఐదేళ్ల పదవి కాలంలో ఏమేరకు ఎన్ని హామీలు కార్యరూపం దాలుస్తాయో వేచి చూడాలి మరి. 

ప్రతిపక్షానిదే కీలక బాధ్యత..

ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని జారవిడిచుకొని అధికారాన్ని కోల్పోయింది. ఫలితంగా  బీఆర్‌ఎస్ ప్రధాన ప్రతిపక్ష స్థానoలో నిలబడింది. పురపాలన రంగంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షానీకే ప్రజల తరఫున గళం విప్పే బాధ్యత మెండుగా ఉంటుంది. అధికార పక్షం హామీలపై ఆందోళన చేపట్టి, అభివృద్ధి దిశలో అధికార పక్షాన్ని నడిపించాల్సిన కీలక రోల్ ఉంటుంది. పట్టణ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర బీఆర్‌ఎస్ కే ఉంటుంది. అభివృద్ధిలో అధికార, ప్రతిపక్షo జోడు గుర్రంలా చిత్తశుద్ధితో పనిచేస్తేనే పట్టణం సర్వోన్నతో ముఖాభివృద్ధి  చెందుతుందనే విషయాన్ని మర్చిపోరాదు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు స్థానిక సంస్థల్లో చేపట్టిన అధికార పదవులను ప్రజాసంక్షేమానికే పూర్తిగా వినియోగించాలి. అధికార దర్పాలను పక్కన పెట్టి ఎవరి బాధ్యతలను వారు త్రికరణ శుద్ధితో నిర్వహించాలి. నిస్వార్ధంగా పనిచేస్తే పట్టణ అభివృద్ధి నల్లేరుపై నడికే అని పరిశీలకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అవకాశాన్ని అధికార, ప్రతిపక్ష ప్రతినిధులు ఏం చేస్తారో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచి ప్రజలు వారిపై ఓ కన్నేసి పెట్టారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ఎప్పటికీ, గుర్తు పెట్టుకోనీ ప్రజాక్షేత్రంలో కాసింత జాగరూకతతో నడుచుకోవాలి

ప్రజలకు సేవ చేసే అవకాశం ఎన్నికల ద్వారానే లభిస్తుంది. ప్రజల ఓట్లు  

అధికారాలను కట్టబెడుతాయి. ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలు హామీల  పరిష్కారం కోసం ఎదురుచూస్తారు. ఇది సంక్షిప్తంగా ఎన్నికల ప్రక్రియ సారాంశం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు వారి వారి రాజకీయ సమర్థత స్థాయిలను బట్టి అధికారాలను అప్పగించారు. బీఆర్‌ఎస్ బలమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడానికి మాత్రమే పరిమితమైంది.

బీఆర్‌ఎస్  బలమైన పోటీని తట్టుకోలేక చతికిల పడిపోయింది. ఈ నేపథ్యంలోపరిపాలన పగ్గాలు కాంగ్రెస్ చేతిలోకి వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ పదవులు  వశమయ్యాయి. ఎన్నికల్లో గెలిపిస్తే పట్టణాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చారు.  ఇచ్చిన హామీల్లో తమ ఐదేళ్ల పదవి కాలంలో ఏమేరకు ఎన్ని హామీలు కార్యరూపం దాలుస్తాయో వేచి చూడాలి మరి..