8 July, 2026 | 1:38 AM

మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు

08-07-2026 12:47 AM

మంథని/కాళేశ్వరం (విజయక్రాంతి) : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామ సర్పంచ్ మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్ సుధీర్‌కుమార్, గ్రామ పాలకవర్గ సభ్యులతో పాటు మరో 20 మంది ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్‌ను వీడి మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ర్టంలో నిజమైన అభివృద్ధి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచిలా నిలుస్తున్నారని కాళేశ్వరం సర్పంచ్ మోహన్‌రెడ్డి అన్నారు.