calender_icon.png 6 January, 2026 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా దోచుకొని పారిపోయారు

04-01-2026 12:28:06 AM

ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

హైదరాబాద్, జనవరి ౩(విజయక్రాంతి): బీఏసీ సమావేశంలో మాకు మాట్లాడేందు కు సమయం కావాలని అడిగింది వారే. తీరా సభలో అవకాశం ఇస్తే, తప్పులు బయటపడతాయని వాకౌట్ చేయడం దుర్మార్గం. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని ఇప్పుడు తోకముడుచుకొని పారిపోయారని ఎమ్మె ల్యే, విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఐలయ్య  మాట్లాడుతూ మూసీ నదికి పునర్జీవనం పోద్దామని ప్రభుత్వం మంచి నిర్ణ యం తీసుకుంటే చర్చకు రారు.. కమీషన్ల కకృత్తితో పాలమూరు- ఎండబెట్టారు.

. దమ్ముంటే అసెంబ్లీలో కృష్ణా జలాల పై, పాలమూరు ప్రాజెక్టుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్రం ఉపాధి హా మీ పథకం పేరు మార్చి, నిధులకు కోత పె డుతుంటే.. కేంద్రంతో ఉన్న దోస్తానా కారణంగా బీఆర్‌ఎస్ నోరు మెదపడం లేదన్నారకు. కేంద్రం చేస్తున్న నష్టం బీఆర్‌ఎస్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

సొంత కూతురు మాటలైనా వినాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా జలాలపై దమ్ముంటే అసెంబ్లీ లో సమావేశం పెట్టాలన్న కేసీఆర్.. తీరా సమావేశం పెడితే వచ్చి సంతకం పెట్టి ౨ నిమిషాల్లో వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలందరూ కేసీఆర్ చేతలను చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. నిన్న మాట్లాడాని కి సమయం ఇచ్చినా కావాలనే గొడవ చేసి హరీశ్‌రావు వాకౌట్ చేశారు. అసెంబ్లీలో చర్చ వదిలేసి బీఆర్‌ఎస్ భవన్లో పవర్ పా యింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. కేసీఆర్ కేవలం అధికారంలో ఉంటేనే సభకు వస్తా రా.. అని ప్రశ్నించారు.

కూతురు కవిత చేసిన వ్యాఖ్యలను ఆది శ్రీనివాస్ ప్రస్తావించారు. మేము అడిగిన ప్రతి ప్రశ్న కూ అవినీతి జరిగిందనేది వాస్తవమని కవిత స్వయంగా చెబుతున్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీ చర్చకు కేసీఆర్ రాకపోతే.. వారి పార్టీని దేవుడు కూడా కాపాడలేడని కవిత అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి కేసీఆర్ చర్చకు రావాలి అని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలని కేంద్రం చూస్తోందని, భవిష్యత్తులో కరెన్సీ నోట్లపై కూడా గాంధీ బొమ్మ తీసేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.