అప్పుడో మాట.. ఇప్పుడో మాట!
- ప్రతిపక్షంలో నీతులు.. అధికారంలోకి రాగానే తుంగలోకి విలువలు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంప్రదాయాలు, విలువలు అంటూ నీతులు చెప్పిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కి తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ ద్వంద్వ వైఖరిని, అనైతిక విధానాలను ఎండగడుతూ ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు.
పీసీసీ అధ్యక్షుడిగా 30--03--2016న స్పీకర్‌కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆడియో విజువ ల్ ప్రజెంటేషన్ నిర్వహిస్తే, అది భారత దేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధమని, అందుకే మేము సభకు హాజరుకాబోమని చెప్పినట్టు గుర్తుచేశారు. ప్రస్తుతం మంత్రి హోదాలో అసెంబ్లీ హాల్లో ప్రజెంటేషన్‌కు సిద్ధపడటం రాజకీయ ద్వంద్వ వైఖరి కి నిదర్శనమని విమర్శించారు.
ఆ ఉత్తరంపై నేటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పద్మావతి కూడా సంతకాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అనైతికత, ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేయడానికి ఈ ఒక్క ఉత్తరం చాలని విమర్శించారు. బీఏసీ సమావేశం లోనూ, ఉత్తరం ద్వారా అధికార పక్షానికి ప్రజెంటేషన్‌కు అనుమతి ఇస్తే, బీఆర్‌ఎస్‌కూ అదే విధంగా అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను కోరామని, అయినా తిరస్క రించారని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, కాంగ్రెస్ అన్ని సంప్రదాయాలకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగానికే తూట్లు పొడుతుస్తున్నదని మండిపడ్డారు.






