04-01-2026 12:23:23 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి) : కులస్తులంతా ఐకమత్యంతో ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని, హక్కులను సాధించుకోవచ్చని తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం అన్నా రు. పెరికకుల ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా రూపొందిం చిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడు తూ.. సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు కుల సంఘాల ఐక్యత ఎంతో అవసరమని సూచించారు.
పెరిక కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్ మాట్లా డుతూ.. పెరిక కులానికి చెందిన ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో పెప్సీ పనిచేస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కమిటీలను నియమించి సంస్థను బలోపేతం చేశామని, తద్వారా కులస్తుల మధ్య ఐక్యతను పెంచుతున్నామని వివరించారు. బీసీ ల్లో ప్రత్యేక గుర్తింపు పొందాలంటే సమిష్టి కృషి అవసరమన్నారు.
కులవృత్తి దెబ్బతిని ఆర్థికంగా వెనుకబడిన పెరిక కులానికి అండ గా నిలుస్తూ, పెరిక కుల కార్పొరేషన్ ఏర్పా టు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెప్సీ ముఖ్య సలహాదారు చింతం లక్ష్మినారాయణ, రాష్ట్ర కోశాధికారి అప్పని సతీష్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆకా రాధాకృష్ణ, ఉమ్మడి నల్గొం డ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బెడుద వెంకటయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బండి శ్రీకాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి శ్రీరామ్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.