28 August, 2026 | 6:34 PM

పేదలకు అండగా ఉంటా

21-05-2024 02:04 AM

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల, మే 20 (విజయక్రాంతి): పేదలకు ఎల్లవేళలా అండగా ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన మత్స్య కార్మికుడు కొండ్ర విద్యాసాగర్ చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకొని మరణించగా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఈ చెక్కును మృతుడి భార్య జమున, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చేతులమీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ సభ్యతం ఉన్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా కింద వారికి రూ.2 లక్షలు అందజేసి అండగా ఉంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కోరే గంగమల్లు, శంకర్, నర్సయ్య, శేఖర్, లింగారెడ్డి, మహేష్, రాజేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.