28 August, 2026 | 7:26 PM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

21-05-2024 02:04 AM

ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల, మే 20 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట్ గ్రామంలోని ఐకేపీ సెంటర్‌ను ఆయన సందరించారు. ఈ సందర్భంగా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఈ నెల 23వ తేదీలోపు ఐకేపీ సెంటర్లలో వడ్లు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. 

ఎమ్మెల్సీకి వినతి..

గత ప్రభుతం వీఆర్‌ఏల సర్దుబాటు కోసం తీసుకొచ్చిన జీవోలు 81,85,98 కారణంగా 55 ఏళ్లు పైబడి 61 ఏళ్లలోపు ఉన్న 2,500 మంది పూర వీఆర్‌ఏలకు అన్యా యం జరిగిందని, సవరణలు చేసి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పూర వీఆర్‌ఏలు వినతిపత్రం ఇచ్చారు. వారి స్థానం లో వారసులకు ఉద్యోగం వచ్చేలా చూడాలని విన్నవించారు. స్పందించిన ఆయన సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.