13 June, 2026 | 4:07 PM

పెద్దేముల్ లో రెచ్చిపోయిన దొంగలు

13-06-2026 03:00 PM

బావి మోటర్, స్టార్టర్ చోరీ. 

తాండూరు, జూన్ 13, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దముల్ లో దొంగలు రెచ్చిపోయారు. వ్యవసాయ పొలం  వద్ద ఉన్న బావి మోటర్ తో పాటు స్టార్టర్ ను చోరీ చేసి ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన రైతు వడ్ల గోపాల చారి (రాజు) వ్యవసాయ పొలం  వద్ద బావిలో ఉన్న మోటార్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మరోవైపు పెద్దముల్ గ్రామానికి చెందిన ఎర్ర లక్ష్మణ్ రైతు పొలం వద్ద బోరు బావి స్టార్టర్ ను సైతం దొంగలు చోరీ చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు.