calender_icon.png 2 December, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ

02-12-2025 06:09:21 PM

కొల్చారం (విజయక్రాంతి): కొల్చారం మండలవ్యాప్తంగా మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు రేపటినుండి నిర్వహిస్తామని ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా తెలిపారు. మొత్తం 21 గ్రామ పంచాయతీలకు గాను 192 వార్డు సభ్యులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆమె తెలిపారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్లు స్వీకరిస్తామని, నామినేషన్ల కోసం 6 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు తమ నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.