05-10-2025 01:20:03 AM
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాను ఓ అందమైన ప్రేమకథతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. తాజాగా ఓ స్పెషల్ వీడియోతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
నవంబర్ 7న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్; సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్; ప్రొడక్షన్ డిజైన్: ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి.