దేశ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్న మోడీ
- ‘బద్లావ్ జరూరీ హై’ పాదయాత్రలో సీపీఐ
- రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్
ఉప్పల్, ఆగస్టు 8విజయక్రాంతి : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ సంపదను కా ర్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్ విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీ జేపీ ప్రజా వ్యతిరేక పాలనకు అంతం పలుకాలి బద్లావ్ జరూరీ హై ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, న వోదయ నగర్, బక్షిగూడ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా వీఎ స్ బోస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్ర జలపై పన్నులు, ధరల భారం మోపుతూ కా ర్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రై వేటీకరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి నెట్టివేస్తోందని ఆరోపించారు.రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, బ్యాం కింగ్, బీమా వంటి కీలక రంగాల్లో ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయడం వల్ల భవి ష్యత్తులో ప్రజలపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పెరుగుతు న్న ధరలు, నిరుద్యోగ సమస్యలతో సామా న్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యువతకు ఉద్యోగ భద్రత లేకుం డా పోతోందని అన్నారు.ప్రభుత్వ విద్య, వై ద్య రంగాలను బలోపేతం చేయాల్సిన సమయంలో వాటిని నిర్లక్ష్యం చేసి ప్రైవేటు రంగా నికి ప్రాధాన్యత ఇవ్వడం ఆందోళన కలిగించే విషయమని బోస్ పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై అవగాహన పెంచి ప్రజలను ఉద్య మాల వైపు చైతన్యపరచడమే ఈ పాదయా త్ర లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జి. దామోదర్ రెడ్డి, ఉప్పల్ మండల కార్యదర్శి టి. సత్యప్రసాద్, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేం ద్ర, సీపీఐ నాయకులు స్వామిదాస్, జాన్, శ్రీనివాస్, జమిలయ్య, ఐలయ్య, ఎల్లయ్య, యాకూబ్, సుధాకర్, మహేష్ కుమార్, భా ను, కిరణ్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.






