calender_icon.png 1 February, 2026 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తుండిపోయే సంక్రాంతి ఇది

01-02-2026 01:11:52 AM

నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్టైన్మెం ట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చి త్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించింది. ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, దర్శకుడు బాబీ కొల్లి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. “సినిమాని ఎంత ప్రేమిస్తే, అంత విజయం వస్తుందని.. మా లాంటి వారు కూడా వంశీని చూసి నేర్చుకోవాలి. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి ఉదాహరణ ఈ ‘అనగనగా ఒక రాజు” అన్నారు. దర్శకుడు బాబీ కొల్లి “టైమ్ బాగుంటే హీరో అవుతారు అంటుంటారు. కానీ టైమింగ్ బాగుండి హీరో అయినవాడు నవీన్ పొలిశెట్టి. ఇటీవల నేను చిరంజీవిని కలిసినప్పుడు ఆయన నవీన్ గురించి మాట్లాడారు.

నవీన్ నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాగుందట కదా, ఎంత ఎనర్జీ ఉంటుంది ఆ అబ్బాయికి, ఈ కొత్త తరంలో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పారు” అని తెలిపారు. చిత్ర కథానాయకుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. రాజు గారి పెళ్లి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది. తెలుగు సినీ చరిత్రలోనే ఇది అరుదైన సంక్రాంతి.

పెద్ద సినిమాలతోపాటు విడుదలై, మీ సినిమా నిలబడుతుందా అని ఎందరో సందేహం వ్యక్తం చేశారు. ఇంతటి పోటీలో కూడా మా సిని మా నిలబడి, ఘన విజయం సాధించిందంటే కారణం తెలు గు ప్రేక్షకులే. నేను కథ విన్నప్పుడు ముగ్గురు గురించి ఖచ్చితంగా ఆలోచిస్తా. మొదట మా నిర్మాతకు నష్టం జరగకూ డదనుకుంటా. రెండు మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోకూడదు. మూడోది కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టి సినిమా చూసే ప్రేక్షకులు..

ఈ ముగ్గురు పెట్టే డబ్బుకు విలువ ఇవ్వాలని నేను ప్రతి కథకి ఆలోచిస్తాను. మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతోనే కాస్త సమయం తీసుకుంటా. సినీ పరిశ్రమలో హీరో అవ్వడం అనేది చాలా కష్టం. యూట్యూబ్ నుం చి వచ్చి హీరో అయినవారు ఎవరూ లేరంటూ.. నేను హీరో ప్రయత్నాల్లో ఉన్నప్పుడు చాలామంది నిరాశపరిచారు. అలాంటి నాకు తెలుగు ప్రేక్షకులు వరుసగా నాలుగో బ్లాక్‌బస్టర్ అందించారు. సాధారణ కుటుంబంలో పుట్టిన నేను, హీరో కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడిని. దానికి స్ఫూర్తి మా గురువు చిరంజీవే.

అలాంటిది చిరంజీవి సినిమాతోపాటు విడుదలై, ఆయనతోపాటు విజయం సాధించడం సంతోషంగా ఉంది. చిరంజీవి నా గురించి మాట్లాడారని బాబీ చెప్పినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి” అన్నారు. ‘నాకు ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకంగా మారింది. ప్రేక్షకులు మాపై ప్రేమను ఇలాగే కురిపించాలని కోరుకుంటున్నాన’ని కథానాయిక మీనాక్షి చౌదరి చెప్పారు. ‘డిస్ట్రిబ్యూటర్లు మాకు లాభాలు వచ్చాయని చెప్పడమే.. నిర్మాతకు పెద్ద విజయం.

మంచి లాభాలను చూశామని అందరూ చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింద’ని నిర్మాత నాగవంశీ తెలిపారు. దర్శకుడు మారి మాట్లాడుతూ.. “నవీన్ వంద కోట్ల క్లబ్‌లో చేరారు. ఆయన కష్టానికి, తపనకు దక్కిన విజయం ఇది” అన్నారు. రచయిత్రి, క్రియేటర్ డైరెక్టర్ చిన్మయి, గీత రచయిత చంద్రబోస్, పలువురు చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.