calender_icon.png 1 February, 2026 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ చూడాల్సిన పండుగ లాంటి సినిమా

01-02-2026 01:03:28 AM

వెండితెర కేజ్రీ కపుల్ శివాజీ, లయ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వం వహించారు. అలీ, ధనరాజ్, రఘుబాబు, పృథ్వీ, బాల నటుడు రోహన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 12న డైరెక్ట్ ఈటీవి విన్ ఓటీటీ వేదికగా ఈ క్రైమ్ కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం మేకర్స్ డేట్ అనౌన్స్‌మెంట్, సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కథానాయకుడు శివాజీ మాట్లాడుతూ.. “ఫ్యామిలీ అంతా కూర్చుని ఒక సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా ఇది” అన్నారు. కథానాయకి లయ మాట్లాడుతూ.. “ఈటీవీలో 90’స్ చేయాల్సింది.. మిస్సయ్యా. ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది” అని చెప్పారు. డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ మాట్లాడుతూ.. “శివాజీకి ధన్యవాదాలు.

ఆయన ఫస్ట్ హీరో, ప్రొడ్యూసర్. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, యాక్టర్ ప్రిన్స్, సింగర్ భోలే షావలి, చైల్ ఆర్టిస్ట్ రోహన్ తదితరులు మాట్లాడారు.