calender_icon.png 1 February, 2026 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితాన్ని చూసే కోణం మారింది

01-02-2026 01:13:26 AM

విశ్వక్‌సేన్ హీరోగా దర్శకుడు కేవీ అనుదీప్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేశ్ వీకే, వీటీవీ గణేశ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రం నుంచి రెండోగీతంగా ‘రట్టాటటావ్’ విడుదలైంది. ‘రట్టాటటావ్ పిల్ల రట్టాటటావ్.. నీకు దండం ఎట్టుకుంట పిల్ల రట్టాటటావ్..’ అంటూ సాగుతోందీ పాట.

దేవ్ పవార్ రాసిన ఈ గీతానికి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా, రామ్ మిరియాల ఆలపించారు. శనివారం హైదరాబాద్‌లో ఈ గీతావిష్కరణ కార్యక్రమంలో కథానాయకుడు విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. “నా మొదటి సినిమా నుంచే ప్రేక్షకులతో నాకు మంచి అను బంధం ఏర్పడింది. మంచి సినిమా చేసిన ప్రతిసారీ నన్ను ప్రోత్సహించారు. ఒకట్రెండు సినిమాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి.

అందరి ఫీడ్ బ్యాక్ తీసుకున్నా. ‘ఫంకీ’తో మళ్లీ ఒకటి నుంచి మొదలుపెడుతున్నా. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనుదీప్ ప్రత్యేకమైన వ్యక్తి. తనతో పనిచేసిన తర్వాత నేను సినిమాని, జీవితాన్ని చూసే కోణం మారిపోయింది. అనుదీప్ రచన, హాస్యం భిన్నంగా ఉంటుంది. ఫంకీ మీ అంద రికీ మంచి అనుభూతిని ఇస్తుంది” అన్నారు. కథానాయిక కయాదు లోహర్ మాట్లాడుతూ.. “సినిమా ఆద్యంతం నవ్విస్తుంది.

ఇంత మంచి సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. ఈ చిత్రాన్ని అందరికీ చూపించడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం” అని చెప్పారు. ‘కుటుంబంతో కలిసి ఫంకీ సినిమాని సంతోషంగా చూడొ చ్చు. ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వులు పంచుతుంద’ని దర్శకుడు అనుదీప్ తెలిపారు.