16 July, 2026 | 4:03 PM

మనసుతో తీసిన సినిమా ఇది

14-06-2024 12:05 AM

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రలో నటించిన సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. ఫ్లు హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మిస్తున్నారు. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించగా, దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ధీరజ్ మొగిలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “దర్శకుడు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను ఎంతో ఇష్టంతో, మనసుతో, ప్రేమతో తీశారు” అన్నారు. ‘ఈ సినిమా అన్ని వర్గాల వారిలో స్ఫూర్తి రగిలించేలా ఉంటుంది’ అని ధీరజ్ చెప్పారు. అజయ్ ఘోష్ మాట్లాడుతూ ‘ఇది సినిమా కాదు జీవితం. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా ఏదైనా సాధిస్తారు’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు, నిర్మాణబృందం, టెక్నికల్ టీమ్ మాట్లాడారు.