calender_icon.png 13 July, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఫారినర్‌తో షూట్ చేయించిన పల్లెటూరి సినిమా ఇది

13-07-2025 12:47:19 AM

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో రూపొందిన రూరల్ కామెడీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. నటి, -చిత్ర నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 18న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో టీమ్ శనివారం ప్రెస్‌మీట్ నిర్వహిం చింది. ఈ సందర్భంగా హీరో మనోజ్‌చంద్ర మాట్లాడుతూ.. “కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాలో ఇదొక చోటు. కానీ ఈ సినిమా మా గుండెల్లో చోటు.

18వ తారీఖున మీ గుండెల్లోకి దూసుకొస్తున్నాం” అన్నారు. డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. “ఇది నా మూడో సినిమా. ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనుకున్నా. పల్లెటూర్ని ఒక ఫారిన్ సినిమాటోగ్రాఫర్‌తో షూట్ చేయించాం. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అవ్వొద్దు.. చాలా గమ్మత్తుగా ఉంటుంది. హాయిగా నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్‌లో నా స్టుటైల్‌లో కొన్ని సెన్సిబిలిటీస్ కాన్సెప్ట్స్.. తప్పకుండా ఆలోచన కలిగించేలా ఉంటాయి. ప్రేక్షకుల మీద నమ్మకంతో నేను డైరెక్షన్ చేసిన సినిమా ఇది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు రవీంద్ర విజయ్, బెనర్జీ, ఫణి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.