శ్రీనివాస మంగాపురం కొత్త తేదీ ఇదే
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజ య్ భుపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను పీ కిరణ్ నిర్మిస్తుండగా, అశ్విని ద త్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కు మార్తె రాషా తడాని తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండగా, సీనియర్ నటుడు డాక్టర్ మోహన్‌బాబు శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు, వీడియోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా మరోమారు వాయిదా పడింది.
తొలుత ఈ చిత్రాన్ని జూలై 9న విడుదల చేయాలని భావించారు. అయితే, అనూహ్యంగా చిత్రబృందం ఈ కొత్త విడుదల తేదీని శుక్రవారం ప్రకటించింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి డీవోపీ: జయకృష్ణ ఐఎస్‌సీ; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ఎడిటర్: మాధవ్‌కుమార్ గుళ్లపాటి; ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్.






