మండల వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు
02-04-2026 04:11 PM
మాట్లాడుతున్న సర్పంచ్ కృష్ణాజి
వాంకిడి, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం వాంకిడి మండల వ్యాప్తంగా 28 గ్రామపంచాయతీలో సర్పంచుల అధ్యక్షతన ప్రత్యక గ్రామసభలు చేపట్టారు. గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి, సంక్షేమ ఫలాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి గ్రామ సభ ద్వారా తీర్మానాలు చేశారు. అనంతరం గ్రామ సభకు హాజరైన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని, దరఖాస్తులను గ్రామల సర్పంచ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచ్, వివిధ శాఖల అధికారులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు హాజరయ్యారు.




