13 July, 2026 | 9:40 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఈసారి యుద్ధం వేరు..

21-02-2026 01:54 AM

2026లో సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ ఒకటి. పోస్టర్స్, గ్లింప్స్‌తో కొన్ని నెలలుగా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తోందీ చిత్రబృందం. చిత్ర కథానాయకుడు యశ్ పుట్టినరోజు సందర్భంగా అతని పాత్రను ‘రాయ’గా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

హీరోయిన్లు కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లకూ మంచి స్పందన దక్కింది. తాజాగా శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్.. ప్రేక్షకుల అంచనాలను మరోస్థాయికి చేర్చింది.

‘ఈసారి యుద్ధం వేరు.. వాళ్ల కుతంత్రాలు వేరు.. అందరితో విరోధం పెట్టుకొని బతకలేవ్.. పట్టుదల వదిలెయ్..’ అంటూ సాగుతున్న ఈ టీజర్ విభిన్నమైన సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. యశ్, గీతూ మోహన్‌దాస్ సంయుక్తంగా కథ రాయగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణ, యశ్ నిర్మించిన ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.