13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

అల్లు అర్జున్ సినిమా తొక్కిసలాట కేసు..

21-02-2026 01:52 AM

ఛార్జీషీట్‌లో లోపాలు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు ఎంతమాత్రం ఉపశమనం కలగటం లేదు.  అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప-2’ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  ఈ ఘటనపై ఇప్పటికే ఛార్జీషీట్ నమోదైంది. అల్లు అర్జున్ సహా 23 మందిని బాధ్యులుగా చూపుతూ పోలీసులు ఛార్జీషీట్ దాఖలు వేశారు. 

తాజాగా ఈ కేసు ఛార్జీషీటును నాంపల్లి కోర్టు తిప్పి పంపించింది.  హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లు జతపరచకపోవడంతో తాజాగా మరోసారి ఛార్జిషీట్‌ను వాపస్ చేసింది. ఇలా తిప్పి పంపడం రెండోసారి కావడం గమనార్హం. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప -2’ బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరి గింది.   ఆ ఘటనలో రేవతి అక్కడికక్కడే చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిందపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఘటన జరిగి ఏడాదిన్న పూర్తికావస్తు న్నా బాలుడు ఇంకా కోలుకోలేదు.