పసి పిల్లల ఎదుగుదలకు తొలిముద్ద
21-07-2026 02:31 PM
బోథ్,(విజయక్రాంతి): పసిపిల్లల ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన తొలిముద్ద కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ,పట్టణ సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పోచమ్మ గల్లి అంగన్వాడి కేంద్రంలో తొలిముద్దకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.






