ఎస్‌ఎస్సీ ఫలితాల్లో తూప్రాన్ శ్రీచైతన్య పాఠశాలదే హవా
తూప్రాన్, ఏప్రిల్ 30: మెదక్ జిల్లా తూప్రాన్లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఎస్‌ఎస్సీ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. జిల్లాలో 1వ. 588/600, 2వ. (585/600) ర్యాంకులు సాధించి పాఠశాలకు కీర్తి తెచ్చారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి డీఈవో. ఆర్ల విజయ విజేత విద్యార్థులను అభినందించారు. వారి కృషి, పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
భవిష్యత్తు లోఇదే విధంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కొంపల్లి జోన్ -1 ఏజీఎం జి.వి. రమణా రావు, జోనల్ కోఆర్డినేటర్ రవి, అసోసియేట్ కోఆర్డినేటర్ సోమేష్ లు ఉన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ, తల్లిదండ్రుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో తూప్రాన్ శ్రీచైతన్య పాఠశాల మెదక్ జిల్లాలో తన ప్రతిష్టను మరింత పెంచుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డీన్ అశోక్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.






