1 May, 2026 | 4:08 AM

విజయం సాధించడానికి ఇతరులతో పోటీపడాలి

01-05-2026 02:31 AM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మండలంలోని అన్ని ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో 14 మంది టాపర్గా నిలిచారు.వారికి బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పేరుపల్లి సాయిబాబా ఆర్థిక సహాయం అందజేసి సన్మానించారు.

బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పేరుపల్లి సాయిబాబా గతంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినవారికి బహుమతులు అందజేస్తానని ఇచ్చిన హామీ మేరకు గురువారం మండలంలోని 7 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరచడంతో కాలేజ్ బ్యాగు,సర్టిఫికెట్ ఫోల్డర్, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ అందజేసి అభినందించారు.అలాగే మండల టాపర్ శ్రీదీప్ 5000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా పేరుపల్లి సాయిబాబా మాట్లాడుతూ... తెలంగాణ మోడల్ స్కూల్ అన్ని విధాల మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.అలాగే పరీక్ష సమయంలో మండల టాపర్ శ్రీదీప్ తండ్రి మరణ వార్త విని తండ్రి మరణంతో ఏర్పడిన శూన్యాన్ని అధికమించడంలో శ్రీదీప్ చూపిన ధైర్యాన్ని మనోధైర్యాన్ని పేరుపల్లి సాయిబాబా అభినందించారు.ఆవిద్యార్థికి అన్ని విధాల సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు మద్దతు ఆశీస్సులు అందించినటువంటి పేరులు సాయిబాబాకు ప్రిన్సిపాల్ రాంప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పేరుపల్లి సాయిబాబా,మండల బిఆర్‌ఎస్ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.